భారత్, చైనా సరిహద్దుల్లో శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రధాని మోదీ.రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలకు హాజరైన ఇరు దేశాల నేతలు బుధవారం (అక్టోబర్23) ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించారు. ఈ సంద ర్భంగా రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుక సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.
రష్యాలోని కజన్ సిటీలో ఇరు దేశాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు.. మే 2020కి ముందు ఉన్న యథాతథ స్థితికి చేరుకునేలా - దౌత్య , సైనిక స్థాయి చర్చల్లో ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చిన 72 గంటలలోపు మరోసారి ప్రధాని మోదీ, జిన్ పింగ్ సమావేశమయ్యారు.
ALSO READ | రష్యా పర్యటనలో ప్రధాని మోదీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతికి సహకరిస్తం
రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ, వాస్తవ నియంత్రణ రేఖను ఉల్లంఘించే బీజింగ్ ఏకపక్ష చర్యల ఫలితంగా లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభన నుంచి భారత్, చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి 2019 తర్వాత జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం ఇది.
గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగిన నాలుగేళ్ల తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటులో ఓ ఒప్పందానికి వచ్చారు ఇరుదేశాల నేతలు. రెండు దేశాలు పదివేల మంది సైనికులను ఉంచిన ప్రాంతంలో గాల్వాన్ వ్యాలీలో ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉంది.
గత కొన్నేళ్లుగా అనేక అవాంతరాలను ఎదుర్కొన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలిం గ్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం తర్వాత భారత్-చైనా సంబంధాలలో పురోగతిని ఈ సమావేశం నొక్కి చెపుతోంది.
మోదీ ఏం చెప్పారంటే..
గడిచిన ఐదేళ్లలో భారత్ చైనా మధ్య అధికారిక సమావేశం నిర్వహించాం.. భారత్ ప్రజలకే కాదు ప్రపంచ శాంతి , స్తిరత్వం , పురోగతికి కూడా భారత్ , చైనా మధ్య సంబంధాలు చాలా ముఖ్యమని ప్రధాని మోడీ విశ్వసిస్తున్నామన్నారు. ఈ చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా ఇరుదేశాలు కృషి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిన్ పింగ్ ఏమన్నారంటే..
చైనా, భారత్ రెండూ పురాతన నాగరికతలు, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన దేశాలు.. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సరైన దిశలను కొనసాగించేందుకు , రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు.