పెద్దగట్టు జాతర షురూ .. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా.. విజయవాడకు వెళ్లే వాహనాలను..

పెద్దగట్టు జాతర షురూ .. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా.. విజయవాడకు వెళ్లే వాహనాలను..
  • కేసారం నుంచి దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చేరుకున్న దేవరపెట్టె
  • గంపల ప్రదక్షిణ, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
  • జాతర సందర్భంగా హైవేపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మళ్లించిన పోలీసులు

సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. శనివారం గొల్లబజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యాదవుల కుల దేవాలయం నుంచి మకర తోరణాన్ని దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గుట్టకు తరలించగా, ఆదివారం అర్థరాత్రి కేసారం నుంచి దేవరపెట్టెను, ఖాసీంపేట నుంచి పసిడి కుండను పెద్దగట్టుపైకి చేర్చడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్తులు దేవరపెట్టెతో కాలినడకన దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

 ‘ఒ లింగా.. ఓ లింగా’ నామస్మరణ చేస్తూ గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను సమర్పించారు. దీనితో మొదటి రోజు ఘట్టం ముగిసింది. రెండో రోజైన సోమవారం సౌడమ్మ, ఆకుమంచమ్మ, యాలమంచమ్మ విగ్రహాలకు పూజలు చేస్తారు. భక్తులు ప్రత్యేకంగా బోనాలు వండి నైవేద్యం సమర్పించి సౌడమ్మ తల్లికి మొక్కులు చెల్లించనున్నారు.

భారీగా తరలివచ్చిన ప్రజలు 

పెద్దగట్టుకు భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. శనివారం అర్థరాత్రి నుంచే భక్తుల రాక ప్రారంభం  కాగా ఆదివారం నాటికి క్రమంగా పెరిగింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు గంపలు, బోనాలు తలపై పెట్టుకొని, కటారీలు చేత పట్టుకొని, భేరీలు మోగిస్తూ.. నృత్యాలు చేస్తూ స్వామివారికి బోనాలు సమర్పించారు. భక్తులు సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మకు పూజలు చేశారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు ఉమ్మడి నల్గొండతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలు, ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు 

పెద్ద గట్టు జాతర సందర్భంగా 65వ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రహదారిపై ఆదివారం నుంచి భారీ వాహనాలను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు మళ్లించారు. అలాగే విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్‎నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వైపు మళ్లించారు.