
పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో తొమ్మిది రోజులు పాటు నిర్వ హించిన వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బలిహరణ, కలశో ద్వాసన చేశారు.
పెద్దమ్మ తల్లిని రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా న్యాయమూర్తులతో పాటు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఎంఎండీ కృష్ణవేణి, వరంగల్ జోన్ కమిష నర్ సంధ్యారాణి, అంజనాదేవి దర్శించుకున్నారు. వారికి ఈవో రజనీకుమారి శేషవస్త్రాలు అందజేశారు.