గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్.
పెద్దపల్లి నియోజవర్గంలో సోమవారం ( సెప్టెంబర్ 16) నిమజ్జనం సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు పరిశీలించారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గణేష్ శోభాయాత్రలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద రెండు క్రేన్లను, సుల్తానాబాద్ పెద్ద చెరువు వద్ద మరో క్రేన్ ను ఏర్పాటు చేశామన్నారు.
ALSO READ | పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి :ఎమ్మెల్యే విజయరమణారావు