యువతతోనే దేశానికి దిశానిర్దేశం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

యువతతోనే దేశానికి దిశానిర్దేశం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • యూత్‌‌ ఉన్నతంగా ఆలోచిస్తేనే వికసిత్‌‌ భారత్‌‌ నెరవేరుతుంది: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • అంబేద్కర్ కాలేజీలో ‘వికసిత్ భారత్ 2047 ఆర్థిక ప్రగతి సుపరిపాలన’ అంశంపై నేషనల్ సెమినార్‌‌‌‌

ముషీరాబాద్, వెలుగు: దేశానికి దిశానిర్దేశం యువతతోనే సాధ్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. తన తాత కాకా వెంకటస్వామి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ కాలేజీలో విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌‌ బాగ్ లింగంపల్లిలోని బీఆర్‌‌‌‌ అంబేద్కర్ కాలేజీలో ‘వికసిత్ భారత్ 2047 –ఆర్థిక ప్రగతి సుపరిపాలన’ అనే అంశంపై రెండ్రోజుల పాటు జరిగే నేషనల్ సెమినార్‌‌‌‌కు ముఖ్యఅతిథులుగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌‌లర్‌‌‌‌ కుమార్, ఐసీఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌‌‌ డైరెక్టర్ బి.సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. యువత ఉన్నతంగా ఆలోచిస్తేనే వికసిత్ భారత్ లక్ష్యానికి దగ్గర అవుతామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి గోల్ ఉండాలని, అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలో 70 శాతం మంది ప్రజలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌‌లర్‌‌‌‌ కుమార్ మొగులరం అన్నారు. చిన్న చిన్న షాపుల్లో కూడా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిందంటే.. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయిందో అర్థం అవుతుందన్నారు. ఒక విజన్‌‌తో ముందుకు సాగితేనే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి చేరువ అవుతామని చెప్పారు. ఐసీఎస్‌‌ఎస్‌‌ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ చూపు భారత్ వైపు ఉందన్నారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో ఇండియా యంగెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎదుగుతుందని పేర్కొన్నారు. గ్రోత్ ఎకనామిక్ గుడ్ గవర్నెన్స్ అనే అంశంపై విద్యార్థులకు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపల్ శేఖర్ మట్టతో పాటు అశోక్, డాక్టర్ మధుకర్, డాక్టర్ రమణ శ్రీనిక, విజయేందర్‌‌‌‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

స్టూడెంట్స్‌‌ను సత్కరించిన వంశీకృష్ణ..

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన కాకా డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ విద్యాసంస్థల స్టూడెంట్స్‌‌ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుకున్న తీరు, వారి కుటుంబ నేపథ్యం, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పేద వర్గాల పిల్లలకు విద్యాసంస్థలు ఎప్పుడు అండగా నిలుస్తాయని ఆయన వెల్లడించారు.