
దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ నడిపే విధానమే ఇందుకు నిదర్శమని తెలిపారు. ‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నది. ప్రజలకు అవగాహన కల్పించేందుకే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టినం. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నది. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు’’అని వంశీకృష్ణ తెలిపారు.