కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కార్మికుల సంపాదనను కూడా దోచుకుందని ఆరోపించారు. రామగుండం ఎన్టీపీసి లేబర్ గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం వంశీ.. తాను కార్మికులతో కలిసి పని చేశానని.. వాళ్ల సమస్యలు కూడా తెలుసన్నారు. కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగులకు అండగా ఉండి.. కార్మికుల సమస్యలు తీరుస్తానన్నారు. కార్మికులు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాక వెంకటస్వామి అని కొనియాడారు. కార్మికుల కోసం పోరాడిన వ్యక్తి కాకా.. కాక విజన్ తో వివేక్ వెంకటస్వామి విశాఖ సంస్థ పెట్టారని చెప్పారు.,
కార్మికుల కోసం కొప్పుల ఏం చేశారు: వివేక్ వెంకటస్వామి
దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకు వచ్చిన ఘనత కాక వెంకటస్వామిదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మన దేశంలో పెన్షన్ విధానాన్ని చూసి చైనాలో ప్రారంభించారని చెప్పారు. అప్పుల్లో ఉన్న సింగరేణి సంస్థను కాకా కాపాడారని చెప్పారు. కాకా సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కాపాడితే. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో 24 వేల ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. కార్మిక నాయకుడని చెప్పుకుంటున్న కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాక కుటుంబం ఎప్పుడు సేవ చేయడంలో ముందుంటుందన్నారు. కాళేశ్వరం,మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు