
ఆదిలాబాద్ వెలుగు ఫొటోగ్రాఫర్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, భగీరథ వాటర్ అరకొరగా రావడంతో కేఆర్కే కాలనీ, అంబేద్కర్ నగర్, న్యూ హౌసింగ్ బోర్డ్ 170, తదిత కాలనీల్లో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భగీరథ నీళ్లు, మున్సిపల్ ట్యాంకర్స్ రెండ్రోజులకోసారి రావడంతో అనేక ఇబ్బందులు పడున్నామని తమకు రెగ్యులర్ గా నీరు వచ్చేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. న్యూ హౌసింగ్ బోర్డు170లోకి వచ్చిన మున్సిపల్ ట్యాంకర్ వద్ద మహిళలు ఇలా నీళ్లు పట్టుకుంటున్నారు.