
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తిక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మించాయి. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయాలని నన్ను చాలా మంది అడుగుతుంటారు. వాళ్లందరికీ సమాధానమే ఈ చిత్రం. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా చూసిన ప్రేక్షకులకు ఇందులో కొత్తగా కనిపిస్తాను. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ లవ్ స్టోరీ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ యాక్షన్ సీన్స్ చేశాను. ఇదొక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది’ అని అన్నాడు. ‘ఇదొక న్యూ జనరేషన్ సినిమా. సిద్ధార్థ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు’ అని చెప్పాడు దర్శకుడు కార్తిక్. సిద్దార్థ్ కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల.