జమ్మి ఆకు కోసం తోపులాట.. పోలీసుల లాఠీ చార్జ్

 జమ్మి ఆకు కోసం తోపులాట.. పోలీసుల లాఠీ చార్జ్
  • జగిత్యాల దసరా వేడుకల్లో స్వల్ప ఉద్రిక్తత

జగిత్యాల: దసరా వేడుకల్లో భాగమైన జమ్మి ఆకు కోసం జనం ఎగబడి తోపులాడుకున్నారు. శృతి మించడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. శుక్రవారం దసరా వేడుకల సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన.

బ్రాహ్మణవీధిలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఆనవాయితీగా స్వామివారు జంబిగద్దెకు చేరుకుని పూజలందుకుంటారు. ఈ వేడుకలకు కలెక్టర్ రవి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, పలువురు ప్రముఖులు హాజరుకాగా... కలెక్టర్ జమ్మి ఆకు తెంపి లోపలికి వెళ్లగానే... భారీగా హాజరైన జనం ఒక్కసారిగా జమ్మి ఆకు కోసం ఎగబడ్డారు. దీంతో తీవ్రమైన తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు అదుపు చేయాలని యత్నించినప్పటికీ.. కంట్రోల్ కాకపోవడంతో లాఠీలు ఝుళిపించడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.