దేవరకొండ, వెలుగు : పడుకున్న స్టూడెంట్లను ఎలుకలు కరవడంతో 13 మందికి గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో రెండు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండ భీమనపల్లి శివారులోని బీసీ గురుకులంలో సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం స్టూడెంట్లు పడుకున్నారు.
ఈ టైంలో ఎలుకలు దాడి చేయడంతో 13 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం గమనించిన స్టూడెంట్లు హెల్త్ సూపర్‌వైజర్ వద్దకు వెళ్లగా ఆమె తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా గురుకులం యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.