- ఎమ్మెల్యేకు ఆ గ్రామస్తుల వినతి
భద్రాచలం, వెలుగు : పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో విలీనమైన గుండాల, పిచ్చుకులపాడు, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆ గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.
అభివృద్ధికి దూరంగా ఐదు పంచాయతీలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇద్దరు సీఎంల మీటింగ్లో విభజన సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఐదు జీపీల కోసం డిమాండ్ చేయాలని కోరారు.