వందే భారత్, కేరళ ఎక్స్ ప్రెస్​ను మంచిర్యాలలో ఆపాలి

వందే భారత్, కేరళ ఎక్స్ ప్రెస్​ను మంచిర్యాలలో ఆపాలి

మంచిర్యాల, వెలుగు: వందే భారత్, కేరళ ఎక్స్ ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో ఆపాలని పట్టణ ట్రస్మా ఆధ్వర్యంలో మంచిర్యాల రైల్వేస్టేషన్ మాస్టర్​ను కలిసి వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన స్టేషన్ మాస్టర్ సంబంధిత అధికారులకు ఆ వినతిపత్రాన్ని ఫార్వర్డ్ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు కొమ్ము దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రామగుండంతో పోలిస్తే మంచిర్యాల రైల్వేస్టేషన్​లో 6 రెట్ల అధిక రద్దీ ఉంటుందని, రామగుండం కంటే రైల్వేశాఖకు మంచిర్యాల అధిక ఆదాయన్ని సమకూరుస్తోందని తెలిపారు.

నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప భక్తులు వేల మంది ప్రతిరోజు మంచిర్యాల పట్టణం, చుట్టు పక్క ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్తున్నారని, వారంతా రామగుండం వెళ్లి కేరళ ఎక్స్​ప్రెస్ రైలును అందుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వందే భారత్, కేరళ ఎక్స్​ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో ఆపాలని కోరారు. ట్రస్మా పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ సాదిక్ పాషా, పట్టణ కోశాధికారి మోహన్ వర్మ , రాష్ట్ర మాజీ బాధ్యుడు కస్తూరి పద్మ చరణ్,  కె.ప్రవీణ్ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.