ముస్తాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఆంక్షాలను నెరవేర్చుకున్నామని, సీఎం కేసీఆర్‌పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని ప్లానింగ్ కమిషన్ వైస్చైర్మన్బి.వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మద్దికుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లు, పల్లె ప్రకృతి వనం, హెల్త్ సెంటర్, అంగన్ వాడీ, మహిళా సంఘం భవనాలు, వైకుంఠ ధామాలను ప్రారంభించారు.
బదనకల్‌లో 132/11 సబ్ స్టేషన్, కొత్త జీపీ భవనాన్ని ప్రారంభించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండలంలో కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులను వినోద్ కుమార్ సన్మానించారు. జడ్పీ చైర్‌పర్సన్ అరుణ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, సెస్ చైర్మన్ రామారావు, ఎంపీపీ శరత్ రావు, జడ్పీటీసీ నర్సయ్య, గోపాల్‌రావు పాల్గొన్నారు.