సౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకపోవడంతో ఆసక్తి చూపని యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ, వెలుగు: స్టూడెంట్లు, యువకుల్లో ఆటల పట్ల ఆసక్తి పెంచడం కోసం గ్రామాలు, పట్టణాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఇటు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అటు రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించింది. రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 లోగా ప్రతి మండలంలో కనీసం రెండు క్రీడా ప్రాంగణాలను నిర్మించాలని ఆఫీసర్లకు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. దీంతో ఆఫీసర్లు ఆగమేఘాల మీద ఎక్కడ పడితే అక్కడ, దూరంతో సంబంధం లేకుండా ఆటస్థలాలను ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న పాపాన కూడా పోవడం లేదు. దీంతో పాటు ప్రారంభంలో నిర్మించిన ఆట స్థలాలే తప్ప ఇప్పటివరకు ఒక్క కొత్త స్థలాన్ని కూడా ఎంపిక చేయలేదు.

కంప, ముళ్ల పొదలతో నిండిన ప్రాంగణాలు

గ్రామాలు, పట్టణాల్లో నిర్మించిన ఆట స్థలాల నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చులు కూడా భరించే స్థితిలో పంచాయతీలు లేకపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో బోర్డులు, ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్ల చుట్టూ కంపచెట్లు, ముళ్ల పొదలు పెరిగాయి. ఊరికి దూరంగా ఉండడం, వసతులు, కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకపోవడంతో యువకులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

రూ. లక్షలు వృథా

క్రీడా మైదానాల పేరిట లక్షలు దుర్వినియోగం చేశారే తప్ప వాటి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క నల్గొండ మున్సిపాలిటీలోనే 14  ఆటస్థలాలు నిర్మించారు. పట్టణాల్లో సుమారు రూ.5 లక్షలు. గ్రామాల్లో అయితే రూ. లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్ల కోసం 6 ఎంఎం రాడ్లు వాడాలనే కండీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టినా అంత సైజు రాడ్లు దొరకకపోవడంతో 2, 3 ఎంఎం సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాడారు. ఇప్పటివరకు చేసిన పనుల్లో క్వాలిటీ కూడా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 184 ఆట స్థలాలకు రూ.5.10 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఇప్పటి వరకు కేవలం 66 మైదానాల పనులే కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందుకోసం రూ.10.49 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లో అయితే కేటాయించిన పనుల్లో సింగిల్​ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా దాటలేదు. గ్రామాల్లో స్థలాలు దొరక్క పనుల మధ్యలోనే ఆపేశారు. ఇక నల్గొండ లాంటి పట్టణాల్లో అయితే ఎక్కడిపడితే అక్కడ ఆట స్థలాలు నిర్మించి గాలికొదిలేశారు.

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఎనుగులదొరిలో ఎకరం స్థలంలో ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. అది గ్రామానికి దూరంగా ఉండడంతో యువకులు, స్టూడెంట్లు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో అది పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అసలు అక్కడ క్రీడా ప్రాంగణం ఉన్న సంగతే స్థానిక ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్లకు కూడా తెలియకపోవడంతో పిల్లలను స్కూల్  కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆడిస్తున్నారు. అనుముల మండలం మదారిగూడెంలో ఊరికి దూరంగా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కబడ్డీ కోర్టు, తాగునీటి వసతి లేకపోవడంతో అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు. దీంతో ఆ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం కంప, ముళ్ల పొదలతో నిండిపోయింది.