ఏకలవ్య స్కూళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏకలవ్య స్కూళ్లను  ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆదిలాబాద్, వెలుగు: పీఎం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా26 రాష్ట్రాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ కనెక్టివిటీ ద్వారా బుధవారం ప్రారంభించారు. ఇందులో ఉట్నూర్, ఇంద్రవెల్లి ఏకలవ్య పాఠశాలల ప్రారంభించగా.. కార్యక్రమానికి ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్​ హాజరయ్యారు.

 మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత ఉట్నూర్ లోని ఏకలవ్య పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి స్కూల్​ను ప్రారంబించారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ప్రాజెక్టు అధికారి వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.