ట్విట్టర్లో10కోట్లు దాటిన ఫాలోవర్స్.. ప్రధాని మోదీ ప్రపంచ రికార్డు

ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న లీడర్ గా నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం X(గతంలో ట్విట్లర్) లో 100 మిలియన్ (పదికోట్లు) ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా పదికోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న నేత ప్రపంచంలోనే లేరు. ఆ తరవాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనకు X లో 38.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత దుబాయ్‌ యువరాజు షేక్ మహమ్మద్ 11.2 మిలియన్ ఫాలోవర్స్‌తో బైడెన్ తరవాతి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. Xలో 100 మిలియన్ ఫాలోవర్స్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోడానికి ఇదో గొప్ప వేదిక అని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో తనను ఆదరిస్తారని ఆకాంక్షించారు. 


ఇండియాలోని లీడర్లతో పోల్చినప్పుడు మోదీ ఫాలోవర్లు ఎన్నో రెట్లు ఎక్కువ. రాహుల్ గాంధీకి ట్విటర్‌లో 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి 27.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తరవాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కి 19.9 మిలియన్‌ ఫాలోవర్స్ ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్విటర్‌లో 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.