పదేళ్లలో 17.19 కోట్ల ఉద్యోగాలొచ్చాయ్​ : మన్​సుఖ్​ మాండవీయ

పదేళ్లలో 17.19 కోట్ల ఉద్యోగాలొచ్చాయ్​ : మన్​సుఖ్​ మాండవీయ

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2014 నుంచి 2024 వరకు ఉపాధి కల్పన 36 శాతం పెరిగిందని, 17.19 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనుసుఖ్​ మాండవీయ ప్రకటించారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య  64.33 కోట్లకు చేరిందన్నారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఉపాధి కల్పన రేటు ఏడు శాతమే ఉందని, కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 

2023–24 సంవత్సరంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం 4.6 కోట్ల ఉద్యోగాలను సృష్టించగలిగిందని మంత్రి అన్నారు. ఎన్డీయే హయాంలో సాగు రంగంలో ఉపాధి కల్పన 19 శాతం, తయారీ రంగంలో 15 శాతం, సర్వీస్​సెక్టార్​లో ఉద్యోగాల కల్పన​ 36 శాతం పెరిగిందని వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ ​చేస్తున్న నేపథ్యంలో మాండవీయ ఈ విషయాలు చెప్పారు.