ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో అపార అవకాశాలు

  • భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోని ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ఏటా 2.5 కోట్ల బండ్లనుఅమ్ముతున్నామని వెల్లడి 
  • ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసినమారుతి, హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాటా

న్యూఢిల్లీ: ఇండియాలో ఏటా 2.5 కోట్ల బండ్లు  అమ్ముడవుతున్నాయని, గత నాలుగేళ్లలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి 36 బిలియన్ డాలర్ల (రూ.32 లక్షల కోట్ల) ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న  భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో 2025ను ఆయన ప్రారంభించారు. ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇండియా గమ్యస్థానంగా నిలుస్తోందని అన్నారు. ఐదు రోజుల పాటు జరిగే మొబిలిటీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో వివిధ కంపెనీలు తమ బండ్లను ప్రదర్శనకు ఉంచాయి. 

ప్రధాని మోదీ వివిధ స్టాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి వాటిని పరిశీలించారు. ఈ ఐదు రోజుల్లో సుమారు 100 కొత్త బండ్లు, విడిభాగాలు, టెక్నాలజీ లాంచ్ అవుతాయని అంచనా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ఈ నెల 17 నుంచి  22 వరకు ఢిల్లీలోని భారత్ మండపం, యాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్  మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో జరుగుతుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు గత పదేళ్లలో 640 రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ వివరించారు. పదేళ్ల కిందట ఏడాదికి 2,600 ఎలక్ట్రిక్ బండ్లు అమ్ముడైతే, 2024 లో 16.8 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని గుర్తు చేశారు. 

ఇంకో పదేళ్లలో ఈవీల అమ్మకాలు 8 రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. ప్రజలు తమ పాత బండ్లను స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపి కొత్త బండ్లు కొనుక్కునేలా చేసేందుకు  కంపెనీలు తమ సొంత స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ముందుకు రావాలన్నారు.   కాగా, ప్రస్తుతం ఇండియా ఐదో అతిపెద్ద ఆటో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో అతిపెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నితిన్ గడ్కరీ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ కుమారస్వామి, హర్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్  పాల్గొన్నారు.