పీవోకేను కలపడానికి యాక్షన్ ప్లాన్..

  • మోదీకి  సరితూగే వ్యక్తి  లేడు

  • రేవంత్16 వేల కోట్ల అప్పు తెచ్చిండు

  • ఢిల్లీకి రెండు వేల కోట్ల  కప్పం కట్టిండు 

  • గ్యారెంటీల పేరుతో డబ్బులు వృథా

  • బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

యాదాద్రి భువనగిరి :- పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి మోదీ యాక్షన్ ప్లాన్ రచించాడని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  మోదీకి సరితూగే వ్యక్తి ఈ దేశంలో లేడని, అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాడన్నారు.  లాల్ చౌక్ లో రాహుల్,ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారన్నారు.  కాశ్మీర్ లో  పర్యాటకుల సందడి నెలకొనడానికి మోడీయే కారణమన్నారు.  

గ్యారెంటీలు, ఉచితాల పేరుతో డబ్బులను వృథా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి  పదహారు వేల కోట్లు అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఢిల్లీకి రెండు వేల కోట్ల రూపాయల కప్పం కట్టాడని చెప్పారు.   కాళేశ్వరం , విద్యుత్  అవినీతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  రేవంత్ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు