పాత పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య భారత్ కు సూచిక అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ ను మన దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని చెప్పారు. 75 ఏళ్ల ప్రస్తానాన్ని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. భారత్ నిర్మాణాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక చిహ్నం అని చెప్పారు. ఈ చారిత్రాత్మక భవనం మున్ముందు మనకు ఎన్నింటినో నేర్పిస్తుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లినా ..ఈ పాత భవనం మనందరికి ప్రేరణగా ఉంటుందని తెలిపారు.
దేశ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది అన్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్ 3తో ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపామని చెప్పారు. జీ 20 విజయం 140 కోట్ల ప్రజల విజయమన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ప్రజాస్వామ్య భారత్ కు పార్లమెంట్ ఒక సూచిక అని చెప్పారు. ప్రపంచ దేశాలు విశ్వసించే దేశంగా భారత్ ఎదిగిందని వెల్లడించారు.
Also Read :- కొత్త పార్లమెంట్లో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటం: మోదీ
100 ఏళ్ల భవనానికి మనం వీడ్కోలు పలుకుతున్నామని..పాత పార్లమెంట్ భవానానికి వీడ్కోలు పలకడం బాధగా ఉందన్నారు మోదీ. ఈ భవనంలో మనకు చేదు, తీప జ్ణాపకాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇంద్రజిత్ గుప్తా ఈ భవనంలో 43 ఏళ్ల పాటు సేవలు అందించారని చెపపారు. సభలో మొదట్లో తక్కువగా ఉన్న మహిళల సంఖ్య ఆ తర్వాత క్రమంగా పెరిగిందన్నారు. పార్లమెంట్ లోకి వెళ్తే గుడిలోకి వెళ్లినట్లు అనిపిస్తుందన్నారు. ప్రజల సందర్శనార్థం పాత పార్లమెంట్ భవనాన్ని తెరిచే ఉంచుతామని స్పష్టం చేశారు.