కొత్త పార్లమెంట్ లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ భవనం ఓ చారిత్రాత్మక కట్టడమని అన్నారు. వినాయక చవితి రోజున కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్తున్నామని.. ఆ దేవుడి ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని చెప్పారు. సెషన్స్ తక్కువ రోజులు జరగొచ్చు కానీ.. చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కొత్త పార్ల మెంట్ ద్వారా భారత్ ను ప్రపంచానికి పరిచయం చేస్తామని తెలిపారు. భారత్ ప్రతిష్టను పార్లమెంట్ పెంపొందించిందన్నారు.
కొత్త సంకల్పం..కొత్త నమ్మకంతో 2047 కల్లా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు మోదీ. 2047లోగా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దుతామన్నారు.. చంద్రయాన్ 3 విజయవంతం అయ్యిందని.. చంద్రయాన్ 3 విజయంతో దేశానికి కీర్తి వచ్చిందన్నారు. భారత సత్తా ఏంటో చూపించామని తెలిపారు. జీ 20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జీ 20 సదస్సును ప్రపంచ దేశాల నేతలు అభినందించారని.. భారత పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు మోదీ.
Also Read :- మన పండుగలకు లోకల్ వస్తువులే కొందాం..వోకల్ ఫర్ లోకల్
కాసేపట్లో కొత్త పార్లమెంట్ లో సమావేశా ప్రారంభం కానున్నాయి. 75 ప్రస్థానంపై ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.
#WATCH | PM Narendra Modi says, "...This session of the Parliament is short but going by the time, it is huge. This is a session of historic decisions. A speciality of this session is that the journey of 75 years is starting from a new destination...Now, while taking forward the… pic.twitter.com/suOuM2pnyH
— ANI (@ANI) September 18, 2023