
కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై శనివారం పోక్సో కేసు నమోదైంది. తొమ్మిదో తరగతికి విద్యార్థినులను శారీరకంగా వేధించడమే కాకుండా విషయం బయట చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించడంతో భరించలేక విద్యార్థినులు హెచ్ఎం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ మమతకు ఫిర్యాదు చేశారు.
.విషయం బయటకు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, యువకులు శనివారం స్కూల్‌కు వచ్చి సదరు టీచర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ విద్యాసాగర్ షీ టీంతో స్కూల్‌కు వచ్చి విచారణ జరిపి పోక్సో చట్టం కింద దేవయ్యపై కేసు నమోదు చేశాడు. ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయుడు దేవయ్య ను సస్పెండ్ చేస్తూ డీఈవో శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.