జానీ మాస్టర్​కు బెయిల్​ నిరాకరణ

జానీ మాస్టర్​కు బెయిల్​ నిరాకరణ
  • సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​కు బెయిల్ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు నిరాకరించింది. బెయిల్​కోసం జానీ మాస్టర్​దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్​చేసింది. సోమవారం విచారణ చేపట్టిన కోర్టు జానీకి బెయిల్​ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే.. జానీ బయటకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని నార్సింగి పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.