పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించాలి

పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించాలి

నందిపేట, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్​ పార్టీ చేయనున్న పాదయాత్రలు, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్​రెడ్డి కోరారు. మంగళవారం నందిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్​లో డీసీసీబీ చైర్మన్​ రమేశ్​రడ్డి అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్​  సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.​ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్​ మార చంద్రమోహన్​,​ కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు మహిపాల్, మార్కెట్​ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు తదితరులు పాల్గొన్నారు.