- 2008లో సర్వే చేసిన వారికివ్వకుండా 2017లో సర్వే చేసిన వారికి పట్టాలిచ్చారు
ఖమ్మం జిల్లా: కారేపల్లి మండలం తౌసి బోడులో సర్పంచ్ ఇంటిని ముట్టడించారు పోడు రైతులు. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 2017లో సర్వే చేసిన కొన్ని ప్రాంతాల వారికి రెండు రోజుల క్రితం పట్టాలు ఇచ్చారని తౌసిబోడు రైతులు ఆరోపించారు. 2008లో సర్వే చేసిన తమ పోడు భూములకు మాత్రం పట్టాలివ్వడం లేదు.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.
అధికారులకు లంచాలు ఇవ్వకపోవడం వల్లే తమ భూములకు పట్టా ఇవ్వడం లేదా..? అని నిలదీశారు. అన్ని అర్హతలు ఉన్న తమకు కూడా ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు రైతుల ఆందోళనపై అధికారులు స్పందించారు. పట్టాలు ఇప్పిస్తామని అధికారులు తెలియజేయడంతో ఆందోళన విరమించారు పోడు రైతులు.