![పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు సీపీ సన్మానం](https://static.v6velugu.com/uploads/2025/02/police-commissioner-felicitates-public-prosecutors-and-constables-for-securing-convictions-in-murder-cases_yUbBARe2xT.jpg)
ఖమ్మం టౌన్, వెలుగు : కీలకమైన రెండు వేర్వేరు హత్య కేసులోని నిందితులకు శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ.శంకర్ (జిల్లా కోర్టు) బి.కృష్ణమోహన్ (ఎస్సీ ఎస్టీ కోర్టు) ముదిగొండ, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, భద్రాజీ, హోంగార్డు యూసుఫ్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. భార్య హత్య కేసులో ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తేజావత్ ఉపేందర్ నాయక్, అతడి తల్లి పద్మకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. రాజగోపాల్ బుధవారం తీర్పు వెల్లడించారు.
అదేవిధంగా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో భూమి గొడవలు, పాత కక్షల నేపథ్యంలో మద్యంలో విషం కలిపి ముగ్గురిని హత్యచేసిన కేసులో తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన బోడ చిన్నాకు జీవితఖైదు విధిస్తూ ఖమ్మం మూడో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి డి.రాంప్రసాదరావు మంగళవారం తీర్పు చెప్పారు.
ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించి అభినందించారు. భవిష్యత్లో కేసుల నుంచి నిందితులు తప్పించుకోకుండా ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రుత్వక్ సాయి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ముదిగొండ సీఐ మురళీ, కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై జగదీశ్ పాల్గొన్నారు.