గుడుంబా స్థావరాలపై దాడులు...33 మందిపై కేసు నమోదు

గుడుంబా స్థావరాలపై దాడులు...33 మందిపై కేసు నమోదు
  • 5840 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం గుడుంబా తయారు చేస్తున్న ఇండ్లపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్ మాట్లాడుతూ ఏకకాలంలో పోలీసులు గుడుంబా కేంద్రాలపై దాడులు నిర్వహించడంతోపాటు  గ్రామస్తులకు గుడుంబా వలన జరిగే నష్టాల వివరించారని తెలిపారు.

కొత్త చట్టాలు, సైబర్ నేరాలు, ఆన్ లైన్, ఆర్థిక మోసాలు, బాల్య వివాహాలు, లైంగిక దాడులు ఇతర అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 338 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకొని, 610 కేజీల నల్ల బెల్లం, 5840 లీటర్ల బెల్లం, చెక్కర పానకాన్ని ధ్వంసం చేసి, 33 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది 155 మంది పాల్గొన్నట్లు తెలిపారు. గ్రామాలు, తండాల్లో నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.