కోడి పందెం స్థావరంపై దాడి.. 13 మందిపై కేసు నమోదు

వనపర్తి/పెద్దమందడి, వెలుగు: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ శివారులో సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం కోడి పందేలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై యుగంధర్​రెడ్డి తెలిపారు. పక్కా సమాచారంతో కోడి పందేల స్థావరంపై దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకుని, ఆరు కోళ్లు, 5 బైకులు, 9 సెల్​ఫోన్లు, రూ.20,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

మరోవైపు వనపర్తి రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఎద్దులగేరి శివారులో కోడి పందెం స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎద్దులగేరి గ్రామ శివారులో కొందరు కోడి పందేలు ఆడుతున్నారని పక్కా సమాచారంతో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్​ ఎస్సై జలంధర్​రెడ్డి తెలిపారు. నాలుగు బైక్​లు, 5 సెల్ ఫోన్లు, నాలుగు కోడి పుంజులు, రూ.7,350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.