అమీన్‌పూర్‌లో హైడ్రా పేరుతో బిల్డర్లకు బెదిరింపులు.. బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

అమీన్‌పూర్‌లో సామాజిక కార్యకర్త ముసుగులో హైడ్రా పేరుతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  MCOR ప్రాజెక్ట్ నిర్మిస్తున్న బిల్డర్లను హైడ్రా పేరిటతో బెదిరిస్తున్నట్లు బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విప్లవ్ సిన్వా అనే వ్యక్తిపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ALSO READ : ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్. నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అతను అసత్య ప్రచారం చేస్తున్నాడని బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డిలు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ చాలా క్లోస్ అని ఆయనతో కలిసి దిగిన ఫోటోలు చూపించి విప్లవ్ సిన్హా బెదిరిస్తున్నాడని వారు కంప్లెయింట్లో పేర్కొన్నారు. 

మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో దిగిన ఫొటోలు చూపించాడు. అమీన్ పూర్ లో ఎలాంటి విషయం అయినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తననే అడుగుతాడని చెప్పి బెదిరించాడట నిందితుడు. వాట్సాప్ కాల్ చేసి మీ నిర్మాణాలు హైడ్రా కూల్చకుండా ఉండాలంటే తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని విప్లవ్ సిన్హా డిమాండ్ చేశాడని తెలపారు బిల్డర్లు. లేదంటే వార్తా పత్రికల్లో వారి కట్టడాల గురించి తప్పుగా రాయిస్తానని బెదింరించాడు. దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించారు.