వారి సస్పెన్షన్‌‌‌‌ ఎత్తేయండి.. లేదంటే మమ్మల్ని కూడా సస్పెండ్‌‌‌‌ చేయండి : బెటాలియన్ పోలీసుల

వారి సస్పెన్షన్‌‌‌‌ ఎత్తేయండి.. లేదంటే మమ్మల్ని కూడా సస్పెండ్‌‌‌‌ చేయండి : బెటాలియన్ పోలీసుల
  • సిరిసిల్ల 17వ బెటాలియన్ పోలీసుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌కు చెందిన ఆరుగురు పోలీసులపై వేసిన సస్పెన్షన్‌‌‌‌ను ఎత్తివేయాలని, లేదంటే మమ్మల్ని కూడా సస్పెండ్‌‌‌‌ చేయాలని అదే బెటాలియన్‌‌‌‌కు చెందిన పోలీసులు శనివారం ఆందోళనకు దిగారు. ఏక్‌‌‌‌ పోలీస్‌‌‌‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ పోలీసులు కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో సిరిసిల్ల 17వ బెటాలియన్‌‌‌‌కు చెందిన తిరుపతి, శేఖర్, స్వామి, లక్ష్మణ్‌‌‌‌, శివరామకృష్ణ, నవీన్‌‌‌‌ అనే ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. దీంతో వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే బెటాలియన్‌‌‌‌లోని పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అనంతరం సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.