ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి:  డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ 

అలంపూర్,వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్. ఎస్. చౌహన్ అన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కోదండాపూర్, మనోపాడ్ పీఎస్​లను గద్వాల్ , శాంతి నగర్ సీఐ ఆఫీసులను, డీఎస్పీ కార్యాలయం ను,  జిల్లా పోలీస్ కార్యాలయాన్ని  తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు.  

AsloRead:గోదావరి ఉగ్రరూపం.. నీటి మునిగిన ధర్మపురి సంతోషి మాత ఆలయం

త్వరలో జరుగబోయే సాధారణ ఎన్నికలను సిద్ధం కావాలన్నారు. అంతకుముందు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో  సాయుధ దళ డీఎస్పీ ఇమ్మాన్యేయేల్,  సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.