
సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో మిషన్ భగరథ పథకం నీళ్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్, దుంపలపల్లి గ్రామాల ప్రజలు మిషన్ భగరథ పథకం నీళ్లు తాగి 50 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యం కోసం దుబ్బా్క ఆసుపత్రికి వెళ్లగా కలుషిత నీరు త్రాగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు.
చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఎం సొంత జిల్లాలోనే నీరు కలుషితం కావడంతో మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారం రోజులుగా భారీగా వర్షాలు పడుతున్న కారణంగా నీరు కలుషితమైందని చెబుతున్నారు. ప్రజలు వేడిచేసి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.