భీమదేవరపల్లి, వెలుగు: కొత్తకొండ వీరభధ్రుడి గుట్టపైకి మెట్ల మార్గంతోపాటు, ఇతర అభివృద్ధి పనులను చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 27 రోజుల పాటు నక్షత్ర దీక్ష చేపట్టి, విరమణ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయంలో దీక్ష విరమణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గురుస్వామి రాంబాబు నేతృత్వంలో ఇరుముడి ధరించి కాలినడకన దేవుని గుట్టపైకి ఎక్కి స్వయంభూ శివాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జంగ రాఘవరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వెలిచాల రాజేందర్రావు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.