వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీలో రాత్రిళ్లు కూడా పోస్ట్‌మార్టమ్ చేస్తున్నామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం వీ6 వెలుగులో ‘మూడొద్దులైనా మార్చురీలోనే’ కథనంపై ఆయన స్పందించారు. మార్చురీలో నెలకు దాదాపు 185 శవ పరీక్షలు చేస్తున్నామని, ఫొరెన్సిక్ డాక్టర్ల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. లంచాలు తీసుకోకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మెడికో లీగల్కేసుల్లో పోలీసుల విచారణ అయ్యాక గంటన్నరలోనే పోస్ట్‌మార్టం చేసి బంధువులకు అప్పగిస్తున్నామన్నారు. డెడ్‌బాడీలను ప్రభుత్వ వాహనాల్లోనే ఇండ్లకు చేరుస్తున్నామన్నారు. సాయికుమార్ పోస్ట్‌మార్టం లేట్ అవడానికి డెడ్‍బాడీ గుర్తింపు అవకపోవడమే కారణమన్నారు. విచారణ రిపోర్ట్ ఇచ్చిన గంటలోనే శవ పరీక్ష చేసి అప్పగించామన్నారు.