ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి : పోతినేని సుదర్శన్​

కూసుమంచి, వెలుగు : ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం పాలేరు పాత కాలువ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు.

జిల్లాలోని  ముగ్గురు మంత్రులు ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు తోటకూరి రాజశేఖర్, గంగాధర్, రమాణారెడ్డి, రాధాకృష్ణ, రమేశ్​, రైతులు పాల్గొన్నారు.