రేషన్ కార్డులు మంజూరు చేయాలి : జయ

రేషన్ కార్డులు మంజూరు చేయాలి : జయ

నారాయణపేట, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న రేషన్​కార్డులను వెంటనే మంజూరు చేయాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయ డిమాండ్​ చేశారు. ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నామని చెబుతున్నా.. రేషన్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

రూ.500 గ్యాస్  సిలిండర్  విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతో పాటు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. సంఘం జిల్లా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శారద, సౌజన్య, లక్ష్మి, భాగ్యలక్ష్మి, మహాదేవి, సరళ, లక్ష్మి, సావిత్రమ్మ, అనిత, రాధిక, అరుణ, సుజాత, మంజుల, చంద్రకళ పాల్గొన్నారు.