ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్, శ్రవణ్ రావు పాస్పోర్టులు జప్తు!

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.  మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్ట్ లు జప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.  ఇప్పటికే రీజినల్ పాస్ పోర్ట్  అథారిటీ దర్యాప్తు అధికారులకు లెటర్ కూడా రాశారు పోలీసులు. IAS అధికారుల ఫోన్లు సైతం టాప్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.  ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ ఫోన్లు టాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావులను తీసుకొచ్చేందుకు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు.  ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన డేటాతోపాటు ఎస్‌ఐబీకి సంబంధించిన 62 హార్డ్‌ డిస్క్‌లను నిందితులు ధ్వంసం చేసి.. కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు.  మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారని ఆరోపించారు. కాగా  కేసు విషయమై పత్రికల్లో వచ్చిన కథనాలతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు చేపట్టింది.