
- హైకోర్టులో ప్రభాకర్‌రావు పిటిషన్
హైదరాబాద్. వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, భారత్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్‌రావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. ఈ ఐఏపై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. తనను అన్యాయంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభాకర్‌రావు తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
పిటిషనర్‌కు 65 ఏండ్లని.. వైద్య, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదించారు. ప్రభాకర్‌రావు వారంలో భారత్ రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు.