రైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్

 రైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. నిర్మల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న టీఆర్ ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. రైతుబంధు అనే మాట కేసీఆర్ నోట్లో నుంచే వచ్చిందన్నారు.   ప్రతిపార్టీ దళిత ఓట్లను వాడుకుందని.. కాని దళిత బంధు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ దళారుల రాజ్యం ఏర్పడుతుందన్నారు.  ధరణి రాజ్యం కావాలా... దళారుల రాజ్యం కావాలా అని ప్రశ్నించారు.  పార్టీ చరిత్ర చూసి ఓట్లేయాలని ప్రజలను కోరారు. 

గిరిజనులకు పోడు పట్టాలిచ్చి.. వారిని రైతులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.  ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే లాభమో చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు.  2024 మార్చి తరువాత రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇచ్చి... బీమా సౌకర్యాన్ని కలుగజేస్తామన్నారు.  వ్యవసాయానికి 24 గంటలు కావాలా.. వద్దా.. అని ప్రశ్నించారు.  వచ్చే ఏదేండ్లలో రైతు బంధు ను 16 వేల రూపాయిలకు పెంచుతామన్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ 4 వేల రూపాయిల నుంచి 6 వేల రూపాయిలకు పెంచుతామన్నారు.  పోటీ చేసే అభ్యర్థులను కాకుండా పార్టీని చూసి ఓటెయ్యాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. 

 

ALSO READ :- హీరోయిన్ రంభ వచ్చేస్తోంది.. ఆ హీరోతోనే రీ ఎంట్రీ!