పార్లమెంట్ వింటర్ సెషన్స్ హైదరాబాద్‌‌లో పెట్టాలి: కేఏపాల్

పార్లమెంట్ వింటర్ సెషన్స్ హైదరాబాద్‌‌లో పెట్టాలి: కేఏపాల్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్‌‌లో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం దక్షిణాదికి చెందిన ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ సిటీ దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందని, వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందన్నారు.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అన్న నాగబాబుకు రాజ్యసభ సీటు కోసమే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో మంతనాలు జరిపారని ఆరోపించారు. గతంలో పెద్దన్న చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారని విమర్శించారు. వారికి కుటుంబ స్వార్థం తప్ప మరేది పట్టదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ స్టేటస్‌‌ తెస్తామని చెప్పి, మరోసారి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు.