
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varma) నుండి వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలన్నాయి. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ఆధారంగా తీసుకొని..పల్లెటూళ్ళో నివసించే ఓ కుర్రాడికి హనుమంతుడి శక్తులు వస్తే ఏం జరిగింది అనే కథగా వస్తుండటంతో..ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది.
లేటెస్ట్గా హనుమాన్ మూవీ నుంచి శ్రీరామదూత స్తోత్రం (Sri Ramadootha Stotram) లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. రంరంరం రక్త వర్ణం..దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం..రంరంరం రమ్య తేజం..గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం..రంరంరం రాజయోగం..సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం..రం రం రం రాక్షసాంతం..సకల దిశయశం రామదూతం నమామి..స్తోత్రమ్ ఆకట్టుకుంటోంది.ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి కంపోజ్ చేశారు.
ఇప్పటికే హనుమాన్ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి చాలా హై రేంజ్ ఎక్స్పెక్ట్షన్స్ తో వస్తున్న హనుమాన్ మూవీ..బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో తేలియాలంటే..ఇంకో 10 రోజుల వరకు ఆగాల్సిందే.