ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించండి

ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించండి
  • ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదు
  • ప్రజా నిరుసన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

కర్నూలు: ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదని.. ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించే పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మీట్లాడుతూ PRC జీవో ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన ఉద్యోగుల మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటి అద్దె పెరిగిపోయి హెచ్ ఆర్ ను తగ్గించడంతో ఉద్యోగులకు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాకుండా ఎనిమి గవర్నమెంట్ గా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయలేదన్నారు.  ఉద్యోగుల పక్షాన బీజేపీ పార్టీ అండగా నిలిచిందన్నారు. మేము ప్రశ్నిస్తే మతతత్వ పార్టీ అని అంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా  ప్రజా నిరుసన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ముస్లింలలో కూడా దేశ భక్తిని చాటేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: టీజీ వెంకటేష్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ప్రజలు,కార్యకర్తల ఇబ్బందులు,సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, బీజేపీ లాంటి పార్టీ కేంద్రంలో,రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సమావేశంలో సంఘటన కార్యదర్శి మధుకర్, విష్ణువర్ధన్ రెడ్డి, కె.హరీష్ బాబు, డాక్టర్ పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

అక్షరాస్యులు మీద దాడులు చేయడం.. ప్రజాస్వామ్యం మీద చేసినట్లే 

AP:PRC వ్యతిరేక ఆందోళనలపై స్పందించిన మంత్రి

సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది