హైదరాబాద్కు రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం రేవంత్

హైదరాబాద్కు రాష్ట్రపతి.. స్వాగతం పలికిన  సీఎం రేవంత్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకు  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, మంత్రులు పొన్నం, సీతక్క, హైదరాబాద్ మేయర్  ఘనస్వాగతం పలికారు . మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సంలో ఆమె  పాల్గొంటారు.

అనంతరం  బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవ్‌‌ను ప్రారంభిస్తారు.  రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్  ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను ఆమె సమన్వయం చేయనున్నారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా  హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.  బేగంపేట, జేబీఎస్, ఖార్ఖానా,తిరుమలగిరి,లోత్ కుంట, శామీర్ పేట్, బొల్లారం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.