కేసీఆర్ మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..కొడంగల్​ సభలో ప్రియాంక గాంధీ

కేసీఆర్ మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..కొడంగల్​ సభలో ప్రియాంక గాంధీ

జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణ బాట పట్టారు.  కొడంగల్​ లో నిర్వహించిన కాంగ్రెస్​ ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.  ప్రచారం ముగింపు దశలో  ఉందని ..  ఆలోచించి ఓటు వేయాలన్నారు.  మీ హక్కులను.. మీప్రాణాలను.. మీ ఇబ్బందులను.. ఆందోళనలను గుర్తించి నాతల్లి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కొడంగల్​ సభలో అన్నారు.  మన్నారు.  కేసీఆర్​ మోస పూరిత వాగ్ధానాలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.

ఇంకా ఏమన్నారంటే...

  •  ప్రజల  ఆందోళనలతో తెలంగాణ వచ్చింది
  • ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమం చేశారు... వందలాదిమంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తారు
  • ఈ దేశం కోసం మా కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పించారు...తెలంగాణ అమరుల ఆశయం వృధా కాకూడదు
  • మా నానమ్మ ఇందిరా గాంధీ, మా తండ్రి రాజీవ్​ గాంధీ ఈ దేశం కోసం  ప్రాణాలు అర్పించారు
  • తెలంగాణ వచ్చిన తరువాత బీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చింది. పదేళ్ల నుంచి కేసీఆర్​ అధికారంలో ఉన్నారు
  • కేసీఆర్​ గురించి నాకు తెలియదు కాని ఆయన పనితీరు గురించి నాకు తెలుసు.
  • పదేళ్ల నుంచి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టింది
  • తెలంగాణలో ఇంత వరకు ఒక్క ప్రాజెక్ట్​ కూడా లేదు... కట్టిన ప్రాజెక్ట్​ కూడా కేసీఆర్​ కుటుంబ సభ్యుల కోసమే కట్టారు
  • తెలంగాణ ప్రజలు బీదలుగా మారుతుంటే... కేసీఆర్​ కుటుంబసభ్యులు పెద్ద పెద్ద రాజమహల్స్​ కట్టుకుంటున్నారు
  • తెలంగాణ లో బీదలు.. ఇంకా బీదలుగా.. నిరుద్యోగులు... నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు
  • తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి
  • తెలంగాణలో రైతులు  అభివృద్ది చెందారా అని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ
  • తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయి... కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ధరలు  తగ్గుతున్నాయి
  • తెలంగాణలో  ఆదివాసులకైమైనా న్యాయం జరిగిందా... తెలంగాణ వస్తే మన ప్రభుత్వం ఏర్పడుతుంది
  • ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కోట్లాది రూపాయిలు ఖర్చుపెడుతున్నారు.. ప్రజల డబ్బును ఎన్నికల కోసం వాడుతున్నారు
  • తెలంగాణలో కుంభకోణాలు జరిగాయి.. అభివృద్ది కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును బీఆర్​ఎస్​ నేతలు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి
  • బీజేపీ.. బీఆర్​ఎస్​ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటాయి
  • కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఫాంహౌస్​ నుంచి నడుపుతున్నారు
  • తెలంగాణలో లిక్కర్​ కుంభకోణం, భూ కుంభకోణం,  మాఫియా రాజ్యం నడుస్తోంది
  • దొరల తెలంగాణ ఈ రాష్ట్రంలో బలపడుతుంది
  • ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని నెలకొల్పండి
  • మీకు సేవ చేయడమే మా ధర్మం
  • బీఆర్​ఎస్​ నాయకులు ఈ ధర్మాన్ని మర్చిపోయారు
  •  ప్రజాస్వామ్యంలో ప్రజలే పెద్దలని ఇందిరా గాంధీ అనేవారు.. నాకు ఇందిరాగాంధీ మాటపై నమ్మకం ఉంది
  • బీఆర్​ఎస్​ నేతల కుంభకోణాలను తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు
  • మీరంతా జాగృతులు కావాలని నాకు తెలుసు
  • నాయకులను పరిశీలించి.. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ప్రశ్నించాలి
  • మీ ఓటును వ్యర్ధం చేసుకోవచ్చు.. ఐదేళ్ల భవిష్యత్ మీ ఓటులో ఉంది.
  • దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. పదేళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు.. పదేళ్లనుంచితెలంగాణలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉంది.  దేశ సంపదను మోదీ తన మిత్రడు అదానీకి దోచిపెడుతున్నారు.. రైతాంగం గురించి మోదీ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు.  రైతుల అప్పులను తీర్చలేదు కాని.. అదానీ.. అంబానీ అప్పులను మాత్రం మాఫీ చేశారు. 
  • నరేంద్రమోదీ ఖరీదైన రెండు విమానాలు కొనుగోలు చేశారు. కాని రైతుల రుణాన్ని మాఫీ చేయలేదు
  • ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్​ అమలు చేయమని ఉద్యోగులు అడుగుతున్నారు.. కాని కేంద్రం అందుకు ఒప్పుకోవడం లేదు
  • ప్రజా డబ్బును బీజేపీ లాక్కుటుంది.. తెలంగాణలో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్​
  • కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్​ ఒక్కటే
  • ఇందిరాగాంధీ మనుమరాలను.. సోనియా కూతురిని .. నేను ప్రజలను మోసం చేయను
  • ప్రజలకు అండగా ఉండటమే రాజకీయమని తెలుసుకున్నా 
  • మహిళకు రూ. 2500 ఇస్తాం... కర్నాటక కాంగ్రెస్​ పనితీరు ఎలా ఉందో పరిశీలించండి. కర్నాటకలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు
  • మహాలక్ష్మి యోజన రూ. 2500..గ్యాస్ సిలండర్​ రూ. 500...మహిళలకు ఉచిత బస్​ ప్రయాణం..రైతు భరోసా  ఎకరానికి రూ. 15,000.. రైతు కూలీలకు రూ. 12,000.. ధాన్యంపై రూ. 500 బోనస్​ ఇస్తామని  ప్రియాంక గాంధీ ప్రకటించారు.  ఇంకా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ ఇస్తామన్నారు.
  • కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల అప్పును మాఫీ చేసింది
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ. 5 లక్షలతో ఇంటి స్థలం
  • రాజీవ్​ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా
  • తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు
  • ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్​ స్కూలు
  • విద్యా భరోసా కింద రూ. 5 లక్షలు సాయం
  • ఫాం హౌస్​ సర్కార్​ కావాలా.. ప్రజా పాలన కావాలా.. ప్రజా తెలంగాణ కావాలా వద్దా...  మార్పు కావాలి.. కాంగ్రెస్​ రావాలి అని కొడంగల్​ సభలో ప్రియాంక  ఉద్వేగభరితంగా ప్రసంగించారు.