పూజ పేరుతో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కామ పండితుడు. హైదరాబాద్ బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ కు చెందిన రామకిషోర్ జోషి(58) ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. దోష నివారణ కోసం ఓ మహిళ తన కూతురిని తీసుకుని రామకిషోర్ దగ్గరకు వచ్చింది. అయితే దోష నివారణకు పూజలు చేయాలి మరో రోజు రావాలని చెప్పాడు. అయితే దోష నివారణ పూజ చేయిస్తానని ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లాడు రామకిషోర్. తల్లిదండ్రులను బయటే ఉండమని చెప్పాడు.
ALSO READ | ఓరే నీచుడా.. : రోడ్డు పక్కనే యువతిపై అత్యాచారం..
గదిలోపల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు పండితుడు. దీంతో అమ్మాయి కేకలు వేసింది. రూమ్ బయటికి వచ్చి తల్లి తండ్రులకు చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పండితుడిని అరెస్ట్ చేశారు బహదూర్ పురా పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.