కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలోని ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ పూర్తి కాక పోవడంతో విద్యార్థులు స్లాబ్ కిందే చదువుకోవాల్సి వస్తోంది. ఈ స్కూల్లో 5వ తరగతి వరకు ఉండగా, 28 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. పాత స్కూల్ బిల్డింగ్ శిథిలమై కూలిపోవడంతో ‘మన ఊరు–మన బడి’ కింద రూ.
29 లక్షలతో స్కూల్ బిల్డింగ్ మంజూరు చేశారు. స్లాబ్ వేసి వదిలేయగా, ఏడాది నుంచి వర్క్స్ జరగడం లేదు. దీంతో స్లాబ్ కిందనే టీచర్లు విద్యార్థులకు చదువులు చెబుతున్నారు. బిల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.- కామారెడ్డి , వెలుగు
ALSO READ : ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్..