వేములవాడలో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే వేడుకలు

వేములవాడలో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే వేడుకలు

వేములవాడ, వెలుగు: ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ లీడర్లు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతున్న ప్రధాని మోదీ నిండు నూరేళ్లు జీవించాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, లీడర్లు హనుమండ్లు,  మనోజ్, మల్లేశం యాదవ్, సత్యం, కృష్ణ, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి బీజేపీ ఆఫీసులో ప్రధాని మోదీ బర్త్​ డే వేడుకలు ఆ పార్టీ లీడర్లు ఘనంగా నిర్వహించారు. కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేశ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మీనా, శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ బర్త్ డేను నిర్వహించారు. లీడర్లు కేక్ కట్ చేసి చిరు వ్యాపారులకు తినిపించారు. లీడర్లు చందుపట్ల లక్ష్మారెడ్డి, బుగ్గారెడ్డి, నంది నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిరణ్ నాయక్, రాజురెడ్డి పాల్గొన్నారు.