బాలికల హక్కులు హరిస్తే కఠిన చర్యలు : జడ్జి. బి.పాపిరెడ్డి

 బాలికల హక్కులు హరిస్తే కఠిన చర్యలు : జడ్జి.  బి.పాపిరెడ్డి
  • ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ 
  • జడ్జి.  బి.పాపిరెడ్డి

 మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బాలికల హక్కులను హరించే వారికి కఠిన చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.పాపిరెడ్డి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు  చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని పోలీస్ లైన్ హైస్కూల్ లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..  గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై బాలికలు  అవగాహన కలిగి ఉండాలన్నారు.  

ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే 1098 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి. ఇందిర మాట్లాడుతూ..  బాలికల హక్కులు, రక్షణ, సంరక్షణ కోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. స్కూళ్లలో  లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి, డీడబ్ల్యూఓ జరీనా బేగం, విద్యాశాఖ ఏఎమ్ఓ డి. శ్రీనివాస్, బార్ అసోసియేషన్ సెక్రటరీ రామనాథ్ గౌడ్,  సీనియర్ న్యాయవాది రవికుమార్ యాదవ్, డీసీపీఓ నర్మద, పాఠశాల హెడ్మాస్టర్ జయశ్రీ,  చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులు పల్లెమోని యాదయ్య, నాగభూషణం, శివన్న తదితరులు పాల్గొన్నారు.  అనంతరం చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు.