కల్వర్టును ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు మృతి

ఏపీ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. పూడిచెర్ల దగ్గర బస్సు కల్వర్టుని ఢీకొట్టింది. ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ప్రయాణీకుడు చనిపోయాడు. నిద్రమత్తులో డ్రైవర్ కల్వర్టుని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  

తిరుపతి నుంచి హైదరాబాదుకు బయలుదేర్దిన ప్రైవేట్ బస్సు.. తెల్లవారు జామున పూడిచెర్ల దగ్గర ప్రమాదానికి గురైంది. ఘటనలో మరో నలుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులున్నారు. బస్సు కల్వర్టుని ఢీకొని ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.